హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హరినాధపురంలో పర్యటించిన కమిషనర్

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక 18వ డివిజన్ హరనాధపురం ప్రాంతంలోని ప్రధాన వీధులలో వివిధ విభాగాల అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న డ్రైన్ కాలువల నాణ్యత, నిర్మాణ పనితీరును కమిషనర్ పరిశీలించారు. మురుగునీరు సాఫీగా ప్రవహించేలా నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు.