ATP: అనంతపురం మార్కెట్‌యార్డ్‌కు వారాంతాల్లో వచ్చే పశువులను షెడ్ పైపులకు కట్టడం వల్ల అవి దెబ్బతింటున్నాయని ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. ప్రతి వారం పైపులు విరిగిపోతున్నందున శాశ్వత పరిష్కారంగా కాంక్రీట్ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, వెంటనే శుభ్రత పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'మార్కెట్ యార్డ్‌లో కాంక్రీట్ పనులు చేపడతాం'


