హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలకు సాగునీరు విడుదల చేయాలని వినతి

ATP: ఉరవకొండ నియోజకవర్గంలోని హెచ్‌ఎల్‌సీ, జీబీసీ, హంద్రీనీవా కాలువల కింద వెంటనే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పంటల పరిరక్షణకు కాలువల ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.