హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

జగిత్యాల మున్సిపల్ కార్మికులు తమ వేతనాల్లో కోతలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వాలు వేతనాలను పెంచుతూ పోవడం చూసాం కానీ, ఈ ప్రభుత్వం కోతలు విధించడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు విధించిన వేతనాలను వెంటనే చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.