హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైతు బీమా కొనసాగించాలని కలెక్టర్‌కు వినతి

HNK: రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు వినతిపత్రం అందజేశారు. అర్హులైన రైతులందరికీ నిరంతరాయంగా బీమా రక్షణ కల్పించాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని వెంటనే చెల్లించి రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశాయి.