హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి'

KNR: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. రూ.15 వేల కోట్ల బకాయిలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.