హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంతకల్లుకు చేరుకున్న మంత్రి నిమ్మల

ATP: రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో సోమవారం అనంతపురం జిల్లా గుంతకల్లుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుంతకల్లు రైల్వే గెస్ట్ హౌస్‌లో ఆయనను జిల్లా మంత్రి సవిత, టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతంపై వారు కాసేపు చర్చించారు.