హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లికార్జునస్వామికి వెండి ఆభరణాల సమర్పణ

W.G: ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి కలిదిండి రామచంద్ర రాజు (రామం) కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో 4 కిలోల వెండి ఆభరణాలను సోమవారం సమర్పించారు. ఇటీవల రూ.కోటితో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.