హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో దళితుల సమస్యలపై ధర్నా

కడప కలెక్టరేట్‌ ఎదుట దళితుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు విడుదల చేయాలని, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు అందించాలని, ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్లులేని దళితులకు ఇళ్లు, అంబేద్కర్‌ భవన్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.