హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో ప్రజా దర్బార్ కార్యక్రమం

అన్నమయ్య: మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా నివాసం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.