హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం ఖిల్లాపై రోప్‌వే జోరు..!

ఖమ్మం ఖిల్లా పర్యాటక కేంద్రంగా సరికొత్త రూపు సంతరించుకుంటోంది. పర్యాటకుల కోసం రూ. 29 కోట్ల వ్యయంతో ఇక్కడ రోప్‌వే పనులు శరవేగంగా సాగుతున్నాయి. కోట కింద నుంచి పైవరకు 30 మీటర్ల ఎత్తు, 230 మీటర్ల పొడవుతో ఈ రోప్‌వే నిర్మిస్తున్నారు. ఈ రోప్‌వే ప్రయాణంలో నగరం అందాలు కనువిందు చేయనున్నాయి.