హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

BHPL: జర్నలిస్ట్ రవితేజపై జరిగిన దాడిని MRPS భూపాలపల్లి జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇవాళ MRPS జిల్లా ఇన్‌ఛార్జ్ శ్యామ్ మాదిగ, MRPS-MSP రాష్ట్ర నాయకుడు చంద్రమౌళి మాదిగ, రవితేజ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామన్నారు.