హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తించిన రకాలకే బోనస్ వర్తిస్తుంది : AO

HNK: సన్న వరి క్వింటాల్‌కు ప్రభుత్వం అందించే రూ. 500 బోనస్‌ పొందాలంటే విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే ఆన్‌లైన్‌ ఎన్రోల్మెంట్‌ చేసుకోవాలని పరకాల మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ సూచించారు. గుర్తించిన రకాలకే బోనస్‌ వర్తిస్తుందని తెలిపారు. ఆధార్, పట్టాదారు పాస్‌బుక్‌ వివరాలతో డీలర్‌ వద్ద నమోదు చేయించుకుని ఆన్‌లైన్‌ రశీదు తీసుకోవాలని సూచించారు.