హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగంబండ హైలెవల్ కెనాల్‌కు గండి

NRPT: మక్తల్ మండలం సంగంబండ హైలెవల్ కెనాల్‌కు గండి పడింది. కెనాల్‌కు గండి పడటంతో సాగునీరు వృథాగా పోతుంది. కాల్వ నుంచి పొలాల్లోకి నీరు చేరడంతో పంటలు మునిగాయి. గత రాత్రి నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉధృతికి కెనాల్ గండి పడినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గండి పూడ్చాలని రైతులు కోరుతున్నారు.