హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈగల్' శాఖలో డ్రగ్స్ కలకలం

HYD: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఈగల్ శాఖలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రగ్స్ దందాకు ప్రయత్నించిన వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకునేందుకు ఉపయోగించాల్సిన నిఘా సమాచారాన్ని దుర్వినియోగం చేసి, డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం.