హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇద్దరు ప్రధాన నిందితులు లొంగుబాటు

BHPL: చిట్యాల మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ పుల్ల రవీందర్ ఇంటిపై దాడి చేసి, సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు ప్రధాన నిందితులు నిన్న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏ1 మొక్కిరాల మధువంశీకృష్ణ, ఏ8 ఆరిఫ్‌లను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన హోండా సిటీ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.