హైదరాబాద్: 28°C
తెలంగాణ

UPDATE: కన్నవారికి ఇచ్చిన ఇంజెక్షన్‌తోనే తాను కూడా..

SRD: తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సురేఖ (25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా యాచారం గ్రామానికి చెందిన ఆమె జూలై 31న బెయిల్‌పై విడుదలై సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. ఆదివారం సాయంత్రం కన్నవారికి ఇచ్చిన మత్తు మందు ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.