హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన ఎంఈవో

SKLM: నరసన్నపేట మండలం ఉర్లాం ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ పేడాడ దాలి నాయుడు ఇవాళ సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను నేరుగా వారి సామర్థ్యాలపై పరిశీలించి సూచనలు అందజేశారు. ప్రతిరోజు హోంవర్క్ లు తప్పనిసరిగా ఇవ్వడమే కాకుండా వాటిని పూర్తి చేయడంపై పరిశీలించాలన్నారు.