హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా వర్షాలు.. పంటలకు ఊపిరి

NGKL: జిల్లా వ్యాప్తంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి.