GDWL :గద్వాల పట్టణంలోని 10వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రోడ్డు సమీపంలోని డ్రైనేజీ కాలువలో మురుగునీరు నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుండగా, దోమల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల రోగాల బారిన పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
'డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి'


