హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో తీవ్రతరమైన గదుల కొరత సమస్య

NGKL: తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు గాను కేవలం మూడే గదులు ఉండగా, మరో రెండు గదులు శిథిలావస్థకు చేరాయి. దీంతో విద్యార్థులు సామగ్రి నిండిన స్టాఫ్ రూమ్‌లోనే ఇరుకున పడి పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు వెంటనే అదనపు గదులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.