NDL: గడివేముల మండలం బిలకలగూడూరులో 10 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఎస్సీ కాలనీతో పాటు పలు వీధుల ప్రజలు చుక్క నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బిలకలగూడూరులో చుక్క నీటికి తంటాలు


