హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రల జానకిరాజు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన కుటుంబాలకు మరింత పారదర్శకంగా, సులభంగా అందుతాయని తెలిపారు.