హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం రెండో బ్రిడ్జిపై వాహనాలకు అనుమతి

BDK: భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన రెండో వారధిపై భద్రాచలం వైపు వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతించారు. అప్రోచ్ రోడ్డు వద్ద మట్టి కుంగిపోవడంతో గతంలో రాకపోకలు నిలిపివేశారు. పాత బ్రిడ్జిపై ట్రాఫిక్ రద్దీ, గుంతలతో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది.