KRNL: ఆదోనిలోని నిర్మల్ థియేటర్ ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్‌ను సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. క్యాంటీన్‌లో అందిస్తున్న టిఫిన్ నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ప్లేట్లు, గ్లాసులను వేడి నీటితో శుభ్రపరిచి వినియోగించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్‌లో నాణ్యత, పరిశుభ్రతపై కమిషనర్ వార్నింగ్


