హైదరాబాద్: 28°C
తెలంగాణ

టేకులగూడెంలో ఘనంగా బోనాల పండుగ

KMM: సింగరేణి మండలం టేకులగూడెం గ్రామపంచాయతీలో శ్రావణ మాస బోనాల పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు ముత్యాలమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం పచ్చగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.