హైదరాబాద్: 28°C
తెలంగాణ

చంద్రమౌళీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

KMR: నిజాంసాగర్ మండల కేంద్రంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో శ్రావణమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ సోమవారం కావడంతో ఆలయానికి భక్తిశ్రద్ధలతో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.