VKB: జిల్లాలో 50% సబ్సిడీ వ్యవసాయ యంత్రాల పంపిణీ నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2024-25 కింద జిల్లాకు 454 యూనిట్లు (వికారాబాద్-152, పరిగి-103, కొడంగల్-110, తాండూరు-89) మంజూరు చేసింది. డ్రోన్లు, స్ప్రేయర్లు, పవర్ వీడర్లు వంటి పరికరాల కోసం మహిళా, చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకుని ఏడాది గడిచినా ఇంతవరకు యంత్రాల జాడ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రాయితీ యంత్రాల కోసం రైతుల ఎదురుచూపులు


