హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిబ్బంది కొరతతో మూతపడిన ఆయుర్వేద ఆసుపత్రి

వనపర్తి మండలం పెద్దగూడెంలోని ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది కొరత కారణంగా మూతపడింది. ఇక్కడ వైద్యుడు, ఫార్మాసిస్ట్, అటెండర్ విధులు నిర్వహించాల్సి ఉండగా, వైద్యుడు లేక మందులు అందక సేవలు నిలిచిపోయాయి. ఈ సమస్యపై స్పందించిన ఆయుష్ ప్రాంతీయ డైరెక్టర్ రవి నాయక్, త్వరలోనే కొత్త వైద్యుల నియామకం చేపట్టి ఆసుపత్రిని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.