హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దృఢ సంకల్పంతో లక్ష్యాలను సాధించాలి'

BDK: బూర్గంపాడు మండలం సారపాక పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల సాధికారత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థిని రత్న దీపిక విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణ, పట్టుదలతో ఆటంకాలను అధిగమించాలని సూచించారు. సెల్‌ఫోన్‌తో సమయం వృథా చేయవద్దని తెలిపారు.