హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధాన రహదారిపై చెత్త కుప్పలు

KKD: తొండంగి మండలం పెరమళ్లపురంలో మూడు గ్రామాలకు ఉన్న ఏకైక రహదారిపై చెత్తకుప్పలు పేరుకుపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోడ్డు మలుపు సమీపంలో గత 20 రోజులకు పైగా చెత్త వేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.