హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కెళ్లిన దుండగులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. లక్ష్మీనగర్ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు సాంబరెడ్డి, అహల్య వాకింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అహల్య మెడలోని చైన్‌ను లాక్కెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి,సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.