NRML: నేడు ముధోల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లవ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజా ఫిర్యాదులు విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు ప్రజా ఫిర్యాదుల విభాగం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు ముధోల్‌లో ప్రజా ఫిర్యాదుల విభాగం


