హైదరాబాద్: 28°C
వ్యాపారం

F&O ట్రేడింగ్‌లో జెన్-Zకే భారీ నష్టాలు

డెరివేటివ్స్(F&O) ట్రేడింగ్‌లో జెన్-Z యువత వాటా 43 శాతానికి చేరినట్లు సెబీ తాజా నివేదికలో తేలింది. నాలుగేళ్ల క్రితం ఇది 31 శాతమే. ప్రధానంగా హెడ్జింగ్ కోసం వాడాల్సిన వీటిని యువత అధిక లాభాల కోసం వాడుతూ భారీగా నష్టపోతోంది. గతేడాది ట్రేడింగ్ చేసిన 30 ఏళ్లలోపు వారిలో ఏకంగా 89% మంది నష్టపోవడం గమనార్హం. 60 ఏళ్లు దాటిన వారిలో ఇది 81%గా ఉంది.