హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ కేసులో విజయం.. న్యాయవాదికి ఘన సన్మానం

WNP: బాధితుల తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపించిన న్యాయవాది పొన్నం రవీందర్‌‌ను సోమవారం పెద్దమందడి మండలం బలీద్‌పల్లి గ్రామస్తులు హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. న్యాయమే అంతిమంగా గెలుస్తుందని, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరంగా పోరాడుతామని రవీందర్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఆయన సేవలను ప్రశంసిస్తూ భవిష్యత్తులోనూ న్యాయం కోసం అండగా నిలవాలని ఆకాంక్షించారు.