హైదరాబాద్: 28°C
తెలంగాణ

బావిలో పడి యువకుడి మృతి

ADB: గుడిహత్నూర్(M) గురుజ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదర్శ్ అనే వ్యక్తి పొలం పనులు పూర్తి చేసుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందాడు. ఇంటికి ఎంతసేపు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికితే చివరికి బావిలో నీటిపై చెప్పులు తేలుతూ కనిపించడంతో తీవ్ర భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.