హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన మహిళలతో సందడి చేసిన సత్యవతి రాథోడ్

MHBD: కురవి మండలం పెద్దతండాలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ ఆంగోత్ బిందు, బీఆర్ఎస్ యువ నాయకుడు గుగులోత్ శ్రీరామ్ నాయక్ పాల్గొన్నారు. గిరిజన మహిళలు, యువతతో కలిసి సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని సందడి చేశారు. తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని నాయకులు తెలిపారు.