హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం

NLG: పట్టణంలోని వెంకటరమణ బైక్ షోరూంలో ఇవాళ తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. షోరూం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి, షాప్ యజమానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.