హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా: రేఖా శ్యాంనాయక్

NRML: తన కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ MLA అజ్మీర రేఖా శ్యాంనాయక్ అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తన వంతు సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. దస్తూరాబాద్ మండలం మున్యాల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు విలాస్ యాదవ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొనగా, రేఖా శ్యాంనాయక్ పరమర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.