హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రమేష్ దారుణ హత్య.. సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియో

MHBD: తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ నేల 20న గుంటుక రమేశ్ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా ఇవాళ వైరల్‌గా మారింది. పంపకాల విషయంలో జరిగిన గొడవలో రమేశ్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ప్రాణభయంతో రెండు చేతులెత్తి తనను వదిలేయాలని రమేశ్ వేడుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఘటనపై పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు.