హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధ భక్తురాలుని కుటుంబ సభ్యులకు అప్పగింత

TPT: తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తుడు రమేష్ నానమ్మ సత్యమ్మ (72) టెంపుల్ ఎగ్జిట్ వద్ద తప్పిపోయినట్లు తిరుమల కమాండ్ కంట్రోల్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది, పోలీసు బృందం సీసీటీవీ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి, సత్యమ్మ ఆచూకీని గుర్తించారు. అనంతరం సత్యమ్మను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.