SDPT: హుస్నాబాద్ పట్టణంలోని గీతా మందిర్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి కారు అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న చికెన్ షాప్ ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ధ్వంసమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అదుపుతప్పిన కారు.. చికెన్ షాప్ ధ్వంసం


