హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫుట్ బోర్డుపై ప్రమాదకర ప్రయాణం

NRPT: జిల్లా కేంద్రానికి మద్దూర్, కోస్గి, ఉట్కూర్ మండలాల నుంచి వందలాది విద్యార్థులు వస్తుంటారు. స్కూళ్లు, కాలేజీలు ముగిశాక ఇళ్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. రద్దీ బస్సుల్లో ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా వెళ్తున్నారు. పట్టు తప్పితే ప్రాణాలకే ముప్పు ఉందని, అదనపు బస్సులు వేయాలని విద్యార్థులు కోరుతున్నారు.