హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృథాగా పోతున్న నీరు.. చర్యలు చేపట్టాలని డిమాండ్

BHNG: మోత్కూరు మండలం దప్పెల్లి నుంచి కిష్టాపురం చెరువులోకి వచ్చే నీరు వృథాగా మూసినదిలోకి పోతుంది. కొంతమంది రైతులు తమ పొలాల వద్ద కాలువకు 2 చోట్ల గండ్లుపెట్టి మామూలు మోరీలాగా కట్టారు. ఆ కాలువ పూడిపోయి నీరుపారని పరిస్థితిలో ఉండగా, వచ్చే కొద్దీ నీరు కూడా కిందికి రాకుండా పోతుందని రైతులు ఇందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.