హైదరాబాద్: 28°C
తెలంగాణ

దారుణం.. మైనర్‌పై అత్యాచారం

VKB:​ ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన తాండూరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నియోజకవర్గంలోని 16 ఏళ్ల బాలికను ఒక గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో లోబరుచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.