హైదరాబాద్: 28°C
తెలంగాణ

20 టీఎంసీలు దాటిన మిడ్ మానేరు నీటి నిల్వ

SRCL: బోయిన్‌పల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు రిజర్వాయర్‌లో సోమవారం ఉదయం 6 గంటలకు 20.157 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, నీటిమట్టం 314.87 మీటర్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 17.956 టీఎంసీల నిల్వ ఉంది. 24 గంటల సగటు ఇన్‌ఫ్లో 610 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 127 క్యూసెక్కులుగా నమోదైంది.