హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న నందమూరి దీపిక జానకిరామ్

SRD: లింగంపల్లిలో శ్రావణమాస బోనాల ఉత్సవాలను ఆదివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో నందమూరి దీపిక జానకిరామ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.