హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD మెట్రో రైలులో అమ్మాయితో అసభ్యంగా..!

HYD: అమ్మాయిలు సురక్షిత ప్రయాణానికి మెట్రోనే ఎంచుకుంటోన్నా అక్కడా వేధింపులు తప్పడం లేదు. LB నగర్ నుంచి ఎర్రగడ్డ వెళ్తున్న మెట్రో రైలులో 25 ఏళ్ల యువతి పట్ల మత్తులో ఉన్న శ్రీకాంత్ అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు యువతి అతడిని పట్టుకుని, మెట్రో సిబ్బందికి అప్పగించింది. సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.