హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోటార్ వైర్లు దొంగిలించిన ఇద్దరి అరెస్ట్

GDWL: ఉండవెల్లి మండలంలోని వ్యవసాయ పొలాల్లో బోరు మోటార్, ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్లు దొంగిలించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన బీరప్ప, కర్నూలు జిల్లా క్రిష్ణాపురం గిడ్డయ్య కలిసి పుల్లూరు శివారులో వైర్లు చోరీ చేశారు. ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా ఆదివారం పోలీసులు పట్టుకున్నారు.