హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు అండర్‌-17 క్రీడాకారుల ఎంపికలు

NZB: జిల్లా ‘అత్య పత్య’ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ అండర్‌-17 బాలబాలికల ఎంపికలు రేపు జిల్లా కలెక్టర్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. అధ్యక్షుడు వినోద్‌రెడ్డి, కార్యదర్శి సంజీవ్‌ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఉ.10 గంటల్లోపు రిపోర్టు చేయాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు.